20, డిసెంబర్ 2008, శనివారం
చిరు - పవన్ - నాగబాబు- రేను - అకీరా
13, డిసెంబర్ 2008, శనివారం
వేయి జన్మల పుణ్యం మన ప్రభుత్వ పాలన
౧. ఆశుకవి మారెప్ప
౨. నిష్కపటి ఎం . సత్య నారాయణ్ రావ్
౩.ఉపమాన విశారదుడు శ్రీ శ్రీ రఘు వీరా రెడ్డి
౪. పిట్టకథల రోశయ్య
౫. ఊహా శీలి శ్రీ శ్రీ జే .సి దివాకర రెడ్డి
౬. క్లిష్ట పద పితామహుడు శ్రీ శ్రీ జానా రెడ్డి
౭.భారీ పద ప్రయోగి శ్రీ శ్రీ పొన్నాల లక్ష్మణా చార్యుడు
౮.మత్త గజం శ్రీ శ్రీ బొత్స సత్య నారాయణ
8, డిసెంబర్ 2008, సోమవారం
చిరంజీవి- పవన్ కళ్యాణ్ -సామాజిక న్యాయం
కానీ బ్రష్తుడు , ఒక అమ్మాయిని పెల్లిచెసుకొని మోసం చెసి మరొ అమ్మాయితొ కులుకుతూ సిగ్గు లెక సహజీవనం అని వ్యబిచారం చెసిన చందాలుడు పవన్ కల్యాన్ ను యువజన అద్యష్యుదు ని చెసి నప్పుదు మాత్రం ఇక ఒర్చుకొలెకపూయా , అయ్యా చిరంజీవి నువ్వు కూడా అందరిలాంటివాడివె కానీ , అందరి వాడివి కాదు , ఇదా నీవు తీసుకొచే సామాజిక న్యాయం, చీ నువ్వు ఎన్ .టి .అర్ లా అవడం అటుంచు , బ్రష్టు పట్టి పొతున్నావు , జాగ్రత్థ
హైదరాబాదు -అస్సదుద్దీన్ ఒవైసీ - బొంబాయి
22, నవంబర్ 2008, శనివారం
సాక్షి
20, నవంబర్ 2008, గురువారం
దేముడు గారు
దేవుదిపాలనలో ఏమి అయినా జరగవచు , జైళ్లలోదుష్ట సిస్క్ష న , శిష్ట రక్షణ జరగవచ్చు , ముఖ్య మంత్రి గారు పైళ్ళు చూడకుండా సంతకం పెట్టియ్యవచ్చు , ఫ్ల్య్ ఓవర్లు కూలి భూమాత భారం తగ్గవచ్చు , కాకుంటే చేనేత కార్మికులు , కానీ లేక రైతులు కానీ దేవుడి కి కష్టం లేకుండా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవచ్చు ,
మ్మాట్లాడితే దేవుడికి కోపం వచ్చేస్తుంది , అసెంబ్లీ లో సైతం ప్రతిపక్ష నాయకుణ్ణి అమ్మనా బూతులు తిట్టగల మొనగాడు ,
15, నవంబర్ 2008, శనివారం
మా ఊరూ పాడుబడి పోయా
ఇస్కోల్లో ఆటల పీరియడ్డు వుండే అవి గూడా పోయా , ఇప్పుడు పిలగోల్లు సిత్తూరు లో సదవతావుందారు , ఇంగ్లీషు మీదియమ్ము లో సదవతావుండారు
సూస్తా సూస్తా వుండగానే కాలం మారిపోయా , పాతకాలం ఇండ్లు మొత్తం గా పడిపోతావుండాయి , కరువు పెరిగిపూయా బావుల్లో గాదు , బోరాల్లో గూడా నీళ్లు లకుండాబోయ్యినాయి , అందురూ ఎట్టబతకాలఅందుకే , ఒకూకరుగా బెంగుళూరు కు బొయ్యి బతకతా వుండారు , ముందుగా బోయ్యినోల్లకు అంతో ఇంతో మిగులుబాటయ్య ఇంకా ఊళ్ళో నే ఏదో polliddam అనే వాళ్లు వుండారు , పిలకాయలు సంతోషం గా యాడ బతకతా వుండారు , ఒకోకడికి మార్కులు , యమ సెట్టు రాంకులు , ఇంక ఆనదం యాడిథి , ఏమి బతుకయ్యి పోయ , ఇంక పైన ముందు మాదిరి బతకలేమ, బతుకంతా గుడ్లకి , అన్నానికి సిరిపోకపోతే ఏమి మిగల బెట్టాల పిలకాయలకి పెండ్లిళ్ళు ఎం బెట్టి సేయ్యాల ,
ఊర్లో మంగలోడు యాదమూరు లో షాపు పెట్టుకొనే , సాకలోల్లు గుడ్లు ఉతికేది మానేసిరి , పాపం వాళ్లు మాత్రం ఏమి సేస్తారు , సిత్తూర్లోఅయితే ఒక జతకి మూడు , నాలుగు రూపాయలు వస్తాయి, ఊర్లో అయితే మేర తో ఎట్లా బతికేది , ఊరు పాడు బడిపోయ
9, నవంబర్ 2008, ఆదివారం
ఆశలు- కోరికలు
అసలు ఒక కోరిక కోరినాముఅంటే ఆ కోరిక ఎంత బలమైన దిఅయుండాలంటే మన మనసు శరీరం ,హృదయం నరనరాల్లో ఆ కోరిక జీర్నించుక పోవాలి , మన తల నుంచి కాళ్ళ వరకు ఆ కోరిక మన రక్తం తో కలసి ప్రవహించాలి ,
ఆ కోరిక అనుస్చనంమన ను ముందుకు నడిపించాలి , మన కోరిక మన ఊపిరిగా మారినపుడు మన హృదయాన్ని రగులుస్తున్నప్పుడు , మన ఉస్వాస నిస్వాసల్లో కరిగిపోయినపుడు , మన మనసును తనలో ఇముడ్చుకున్నప్పుడు , ప్రతి సెకను తన లక్ష్య సాదన వైపు మనల్ని ముందుండి నడిపిస్తుంది , మన ప్రతి చర్య తానె నిర్దేశిస్తుంది , మన పొరపాట్లు మన సోమరితనాలు , మన ఆవేశాలు ,ఆందోళనలు ప్రతిదీ మన లక్ష్య సాధనలో సోపానాలుగా మన జీవితాని సాసిస్త్తాయి ,విజేత అవ్వాలంటే అందరినీ అదికమించాలంటేవారందరి కంటే లక్ష్యం పట్ల మనకు గురి ఎక్కువ వుండాలి , వారందిరిని అధికమించాలంటే వారందరికంటే మనకుసంకల్పబలం ఎక్కువ వుండాలి , లక్ష్య సాధన పట్ల మనకు తరగని ప్రేమ వున్నపుడు మన కు ఎదు రయ్యే ప్రతి సమస్య మన శక్తీ యుక్తులను పదును పెడుతుంది , ఎక్కడైతే ప్రేమ ఎక్కువ వుంటుందో అక్కడ అలసత్వానికి , సోమరితనానికి , అలసతకి తావు లేదు , ఎక్కడైతే మన మనసు పూర్తి గా మన ఆశయం తో నిండి పోతుందో అక్కడ మరో వైఖరికి తావులేదు ,
అసలు మన లక్ష్య సాధనలో మన మనసు , శరీరం , మెదడు , ఆత్మ మమేకం అవుతుందో అక్కడ వేరే రకమైన వైఖరి కి తావులేదు , మన లక్ష్య సాధనలో మనం కాస్త వెనక పది పోవచ్చు గాక కానీ మన ఆత్మ ,శరీరం లక్ష్య సాదన వైపు పరుగులు తీస్తున్నప్పుడు మనం మనసు ఆటో మాటిక్ గా తన పొరపాట్లను తన డ్రా బక్లను తన ఆశయం తో మేళవిస్తుంది , మన లక్ష్యం మనకు తెలిసినప్పుడు మన శరీరం మనసు daaniki సిద్దపడుతుంది
నీ ఆశయం నీ జీవితం కావాలి , నేఎ అనువనువులూ అది నిండి పోవాలి నీ జీవితాని అది పూర్తి గా అక్రమించాలి , నీ పొరపాట్లు , ఆత్మ నూన్యతలు , నీ ఆవేశాలు , నీ ఆశయాలు పూర్తి గా నీ ఆశయం వైపు మళ్ళించబడుతుంది , నీ కు నేలక్షీఎంత ప్రియమైనది అవ్వాలంటే అది నీ పోటీ దారులను కాదు నీ కు నువ్వే పూటే అయ్యే లా చేస్తుంది ,
8, నవంబర్ 2008, శనివారం
జీవితం
ఉద్యోగం లో జాయిన్ అవుతాం మొదటి నెల: పని తక్కువ – ఎంజాయ్ ఎక్కువ – ఆల్ హాపీస్రెండో నెల: పని – ఎంజాయ్ – ఓకేమూడో నెల: పని – పని – నో ఎంజాయ్ – సమస్యలు మొదలు ...అప్పటికి ఆఫీసు రాజకీయాలు తెలుస్తాయి.పక్క టీము మేనేజర్ మంచోడు అవుతాడు.పక్క టీము లో అమ్మాయిలు\అబ్బాయిలు బాగుంటారు.పక్క టీము లో జీతాలు తొందరగా పెరుగుతాయిపక్క టీము లో అస్సలు పనే ఉండదు.మనకి మాత్రం రోజూ దొబ్బించుకోవటమే…ఒక్కొక క్లయింటు ఎమో పిచ్హి నా Requirements ఇస్తాడు. అవి పని చెయ్యవని తెలిసీ అలానే చెయ్యాలి.వాడిని అమ్మనా బూతులూ తిట్టి వెళ్ళిపొదాం అనిపిస్తుంది.కాని ఆ ఆఫీసులో నెట్ , కాఫీ ఫ్రీ అని గుర్తుకొస్తుంది.
మనలాంటి వాళ్ళ తో ఒక బాచ్ తయ్యారవుతుంది. వారానికి ఒకసారి మందు కొట్టి మన PLని TLని తిట్టటం మొదలు పెడుతాం. అలా ఆరునెలలు గడిచిపోతాయి.ఇక లూపు లో పెట్టి కొడితే రెండు సంవత్సరాలు గడచి పోతాయి. కళ్ళ క్రింద నల్ల చారలు, వలయాలు… వళ్ళు నొప్పులు.. మెడ నొప్పులు… వేళ్ళు వంకర్లు… వగైరా…అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు వీళ్ళందరినీ చుట్టపు చూపుగా కలవాల్సొస్తుంది। వీళ్ళల్లొ ఎవరైనా మనలాంటి ఉద్యోగం లో ఉంటే మన పరిస్థితి అర్థమవుతుంది. లేకపోతే… ఫోను చేసిన ప్రతిసారీ సంజాయిషీ చెప్పుకోవాలి….
వచ్చిన జీతాన్నంతా క్రెడిట్ కార్డుల బిల్లులలకి, తాగటానికి తగలేస్తాం. ఈ జీవితం అలవాటయిపొతుంది. అలా జీవితం ప్రశాంతంగా గడచి పొతుడగా ఒకరోజు మన కొలీగు తన పెళ్ళి అని పిలుస్తాడు. మనకి కూడా పెళ్ళి చేసుకోవాలనే వెధవ ఆలోచన ఒకటి పుడుతుంది. మన S/W లో అమ్మాయిలంతా పెళ్ళి అయినోళ్ళు, ఆల్రడీ కమిట్ అయినోళ్ళు లెకపొటె ఉత్తర భారత దేశపు వాళ్ళు అయి ఉంటారు. వందలో తొంభయైదు మంది పోగా… మిగిలిన అయిదుగురి లో నలుగురు అక్క అంటే నే బెటర్ అనే లాగా ఉంటారు.
ఇక మిగిలింది ఒక్కరు. ఆ ఒక్క అమ్మాయికోసం, టీం అంతా ఊరకుక్కల్లాగా కొట్టేసుకొంటాం.ఆ అమ్మాయి మాత్రం, ఎవ్వరి తోనూ కమిట్ కాకుండా, అందరితొ పబ్బం గడిపేస్తూ ఉంటుంది.ఒక మంచి రోజు చూసి, నాకు మా బావ తో పెళ్ళి అని పెళ్ళి పత్రికలు పంచుతుండి.మనమదరం, ఆ అమ్మాయి మంచిది కాదు అని డెసైడు చేయటానికి మందు కొడతాం.ఇంకొక అమ్మాయి కోసం ప్రయత్నాలు మొదలు.
ఉద్యోగం లో reviews వస్తాయి. “నువ్వు ఎక్సలెంట్..నువ్వు లేనిదే మా కంపెనీ లేదు… కత్తి కమాల్…“లాంటివెన్నో చెపుతారు.చివరలో… “కానీ…” అని ఒక్క మాటతో గాలి తీస్తారు…నీ జీతం లో ఒక శనక్కాయ పెంచాం ఫొ! అంతారు. మనం సణుక్కొటూనె…అదే శనక్కాయల మీద బ్రతికేస్తుంటాం….జీవితం అంతా దూరదర్సన్ ప్రసారాలలానే ఉంటుందా…??
7, నవంబర్ 2008, శుక్రవారం
ది వైట్ టైగర్
ఇందులో అద్బుతం అంటూ ఏమీ లేదు
అసలు ఎందుకు బుకర్ ప్రైజ్ వచ్చిందో నాకు అస్సలు అర్థం కాలేదు
అసలు హీరో లో హీరో లక్షణాలు కాదు కదా స్ఫూర్తి దాయకమైన గుణాలు ఏమీ లేదు
ఎంత సేపూ డబ్బున్న వారిని తిట్టడం తప్ప ఇందులో ఏమీ లేదు
మానవ అంతరంగ కోణాలను సృజించ లేదు
డ్రైవర్ల ఆలోచనల గురించి అసలు అంతా తప్పు తప్పు గా రాసారు
ఐతే ,
సగం వుడికిన ఆలోచనలు అంటూ చాలా కొత్తగా రాసారు
నీవు తాళం చెవి కోసం చాల కలం గా వెతుకుతున్నావు కానే తలుపు తెరిచే వుంటుంది ,అనడం
వొంటరి గా వచ్చే వున్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనల గురించి
మనుషులలో వున్నా అపరాధ భావన గురించి
డబ్బు పట్ల ఆడ వాళ్ల పట్ల మగవాళ్ళలో వున్నా దాచుకునే కోరికల గురించి
చాలా చాలా చక్క గా రాసాడు
4, నవంబర్ 2008, మంగళవారం
ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే
ఆడువరిమటలకుఅర్థాలు వేరు కాదు , అసలు లేదులే , అని చెప్పుకోవాలి ,అసలు వారు ఎందుకు మాట్లాడుతారో ,ఎందుకు మౌనంగా వుంటారో , మగాళ్ళు మాట్లాడితే ఎందుకు తిడతారో అస్సలు అర్థం కాదు ,
వాళ్లు అలిగితే మనమే బ్రత్ర్హిమాలుకోవాలి ,మనం అలిగినా మనమే బ్రతిమాలుకోవాలి ,
వాళ్ళతో షాపింగ్ వెళ్ళడమంటే ఇక నరకమే , మనకు పరిచయం వున్నా వాళ్ళు కనిపిస్తే మనం మాటలాదకూడదు , కాని వాళ్ళఫ్రెండ్ కనిపేస్తే గంటలకొద్దీ మాట్లాడతారు , అంట సేపు మనం నిల్చుని దిక్కులు చూస్తూ వుండాలి ,పోనీ వాళ్ళతో మాటలు కలపబోతే అదో ప్రమాదం , వాళ్ళ డ్రెస్ గురించి సమయం సందుర్భంలేకుండా మన అభిప్రాయాలు చెప్పాలి ,కొంచెం పొగిడితే సోప్ వేస్తున్నమంటారు ,పోనీ బాగా లేదంటే అస్సలు టెస్టులేదంటారు , వాళ్లు జోక్ వేస్తె మనం నవ్వాలి కానీ మనం జోక్ వేస్తె ముఖం చిట్లి స్టారు , వాళ్లు పరాయి అబ్బాయిలగురంచి మాట్లాడితే మనం లైట్ తీసుకోవాలంటారు , మనం ఇంకో అమ్మాయి గురించి మాట్లాడితే ఇంకా చచ్చామే , వాలగురించి వాళ్లు చెప్పుకుంటే అది నిజం అంటారు ,మనగ్ఫురించి చెప్పుకోబోతే సెల్ఫ్ డబ్బా అంటారు ,వాళ్ల ఇంట్రెస్ట్ ల గురించి మనం వినాలి మనం చెప్పబోతే బోర్ అంటారు , వాళ్ళని నవ్వించాలి ,లాలించాలి ,తిడితే పడాలి , ఒదార్చాలి ,ఆసక్తి గా కబుర్లు చెప్పాలి , మనని ఫూల్ చేస్తే లైట్ తీసుకోవాలి , వాళ్ళ కోపాన్ని భరించాలి , మనకు కోపం వస్తే మనమే సారీ చెప్పాలి , వాళ్ళకి కోపం వచ్చినా మనమే సారీ చెప్పాలి , ఇంకా వాళ్ల కు మూడ్ వచ్చి నప్పుడల్లా అర్ధరాత్రీ ఆపరాత్రీ లేక ఫోన్ చేసి ఇంకా ఏంటి సంగతులు అంటారు , మనం చచ్చి నట్లు కబుర్లు చెప్పాలి , వాళ్ళకి ఏడుపు వస్తే ఏడుస్తారు మనం ఏడవ బోతే మగాడివి కాదా అంటారు , వాళ్ళకి ఐస్ క్రీమ్ లు , చాక్లెట్లు , ఇంకా నానా చెత్తా కొనివ్వాలి ,
3, నవంబర్ 2008, సోమవారం
సిగ్గు లజ్జా లేని ప్రభుత్వం
ఇష్ను ప్రియ ఇస్కూల్లో మా కాపీ ల కథలు
టయాలుబాగలేక మా పెద్ద ఇవోరు రిటైర్డ్ అయిపోయ్యినాడు ,ముందే సేప్తున్నారు , పెద్ద ఇవోరు రిటైర్డ్ అయిపోతే మీ పని ఇపోతిందని ,మాకు గూడా బయ్యం గానే ఉండే , పెద్ద ఇవోరు అంటే మా ఇస్కూలు హెడ్డు
నేను - పద్మనాభ ఐఒరు
నేను రెండో క్లాసు లో వుండగా, మా వూర్లో ఇస్కోల్లో ఇవోర్లలో రెండు గ్రూప్లు వుండే
౧. ఎర్రమేడం (విజయ ప్రభ దేవి ), లెక్కల ఐఒరు (సోమశేఖర్ ),సోషయాల్ఐఒరు (నరసింహులు శెట్టి)
౨.నల్ల మేడము(మనో రంజని), హెడ్ మాస్టారు ,
వీళ్ళల్లో మనకు పస్టు గ్రూపు తో లిన్కెక్కువ సరే ఒకదినం మా వూరు రాధా గోడు ఇస్కోలు పక్కనే వున్న పుల్లయ్య గారి ఇంటి పక్కన కుచ్చోని పారీస్చ పేపెర్లు కాపీ కొడతా వుంటే నేను సల్లగా లెక్క ల ఇవోరికి సేప్పస్తి,అంతే వాడి వొళ్ళు వూదిపోయ్యింది , అంతే వాడు నా మీద కచ్చ పెట్టుకొని హెడ్మాస్టారు కి పురక్క్న్చినాడు ,
ఆ పొద్దు నేను ఇస్కోలుముందర కుచ్చోని రాసుకుంటా వుంటే , గుట్టకింద్దూరునిత్య గోడు , గాండ్లోల్ల మురళి గోడు , రాధా గోడు నను సూపించినారు , నాకు గుండె కాయజారిపోయా , స్వామి గబగబా నాలుగు మొక్కులు మొక్కితి , నా మాట ఇంట్లో నే ఎవ్వురూ పట్టించుకోరు అట్లాంటిది అయన ఎందుకు పట్టిచుకుంతాడు, నేను ఇంటిపాటం రాసు కుంటా వుంటే హెడ్ మాస్టారు వచ్చి ఏఁ వైయ్ ఎట్టా వుండాది ఒళ్ళు అనే ,అంతే నాకు ఒణుకు బుట్టె
2, నవంబర్ 2008, ఆదివారం
పెద్ద ఇస్కోల్లో నేను
నేను ఎస్ .పి.ఎల్
నేను మా వుళ్ళో సిన్నప్పుడి నుంచీ అంటే బాలవడి నుంచీ సడువుకున్తావుంటిని. బాలబడి అంటే మన ఇస్తా రాజ్యంఅని అందరూ అంకుంటాఉంటారు , ఏలంటే ఆడ ,టీచరు మా సిన్నవ్వ .పేరుకే అవ్వ కాని నన్ను ,మా అత్త కొడుకు నరేష్ గాడిని మాయవ్వ ములాజులేకుండా ఉతికి ఆరేస్తా ఉండే ,మేడమ్మ మనవళ్ళుగా మా మీద శానా బరువు బాద్యతలుండే ,మేము అసలు శానా సక్కగా సదువుకోవాలిలేక పోతే మాయవ్వ ఇంట్లో కూడా పాఠాలు సేప్తాది కాబట్టి మేము శానా కష్టపడత ఉంటిమి .ఇస్కూలు అవగానే పిలకాయలంతా ఇండ్లకు బోతా ఉంటే మేము గుక్కు మిక్కని ,టూసన్లోగుచ్చూని సాయంత్రంబస్సు కోసం వాయిటింగ్ సేస్తా ఉంటాము ,ఎలేంటే సాయంత్రం ఉర్లోబస్సు వస్తే గానీ మాయవ్వ టూషణ్వదిలి పెట్టదు , ఇవ్వన్నీ గాకుండా ఆదివారం ఇంట్లో లెక్కల ట్యూషన్ ,మనం లెక్కల్లో క్లేవేర్మి కాదు కాబట్టి ఇంక తప్పక లెక్కలు సేస్తా ఉంటిమి ,దీంట్లో మా నరేష్ గోడు బెట్టరువాడికి లెక్కలు బాగా వస్తాయి ,
సూస్తా సూస్తా ఉండగానే నేను బాలవాడి దాటి పెద్దిస్కోలులోకి వచ్చేస్తేమి ,ఆ పొద్దు మన స్టిల్లు సూడల్చిందేగానీ సేప్పలేము ,అప్పిడికేమాయన్న యాదమూరులో కానిమెంటుకు పోతా వుండే ,అసలు మనం గూడా ముందు కానిమెంటు లో నే సేరినా,మన కు బోరుబండి అంటే శానా ఇష్టం కాబట్టి అదే కావాలని శ్రీదేవి మేడం ని తిట్టి తన్ని ,మాయన్నని తన్నించి ఇస్కూలుకి నిల్చి పోయి శానా శానా కతలు సేస్తిమి కాబట్టి ,వీణ్ణి ఊర్లో ఇస్కోల్లో నే పెట్టాలని ఇంట్లో అనుకుని దీన్లూ పడదోసిరి . మనం చానా చానా క్లేవేర్ మీ కాబట్టి ఒకటో వచ్చేస్తిమి ,కానీ లోపల కొంచం బయం గానే ఉండే ఏలనంటే మా పెద్ద ఇకలాసు సధవకుండా రెండో కలాసు లో కి వచ్చే స్తిమి గానీ ఐ స్కోలులో హెడ్డు మాస్టారు ఎవరను కున్న్యారు ,పద్మనాభ నాయుడు .
31, అక్టోబర్ 2008, శుక్రవారం
నేటి చదువులు
కానీ వల్ల పిల్లలను కార్పొరేట్ స్కూల్లో ,కాలేజీ లలో చదివిస్తూ ఉంటారు .
ఇదంతా ద్వంద విలులలతో కూడిన మాటలు ,నిజం చెప్పాలంటే నేడు చదువులు చాలా బాగున్నాయి ,ఇంకా గురుకు ల పాఠశాల విద్యలు మనకు సూట్ అవ్వవు ,ఇప్పటి జనరేషన్ లో పిల్లలు చాల పోటీ ఎదుర్కూవలసి వస్తోంది ,చాలా బాగా నేర్చుకోవలసి వస్తోంది ,పై మాటలు మాట్లాడేవాళ్ళు వీధి బడులలో ఆటలాడుకుంటూ చదువుకుని వుండవచ్చు కానీ నేడు అది సాద్యం కాదు ,నేడు చదువులు ముక్యంగా బహు ముఖం గా విస్తరించాయి .చల్ల చల్ల కష్టపడితే గానీ ర్యాంకులు సాద్యం కాదు .
ముక్యం గా కార్పోరేట్ కాలేగేస్ ని మెచ్చు కో వలసి వస్తోంది , వారు చాలా జాగ్రత్త గా చదువులు చెప్తున్నారు .మనమందరం చెత్త తెలుగు కాలేజి సినిమాలు చూస్తూ అందు లో టీచర్లను హేళన చేయడం లాంటి చెత్త సీన్లు చూస్తో అదే నిజమైన కాలేజి అని బ్రమలూ ఉన్నాము ,నా మట్ట్కు నాకు డిగ్రీ మూడు సంవస్తరాలు నేర్చు కొంది ఏమీ లేదు ,వాళ్ళునేర్పించ్ది ఏమి లేదు ,ఒక వ్యక్తి జీవితం లో మూడు సంవస్తరాల సంయయం తక్కు వేమీ కాదు ,తరువాత విజయవాడ కి వెళ్ళిన తరువాత నాకు చదువులు అంటే ఇలా ఉంటాయని తెలిసింది ,అక్కడ మాకు పొద్దున్న ఆరు గంటలనుంచి రాత్రి పది గంటలవరుకు క్లాస్సులు ఉండేయి ,కొద్ది రోజులు చాలా కష్టం అనిపించేదే ,కాని తరువాత అలవాటు అయిపోతుంది ,ఎవరికైనా ,ఎక్కడైనా ,మనసు ముందుగా అలా ఏడు తిరుగుతుంది తరువాత అదే అలవాటు అయిపోతుంది ,కానీ స్వేఛ్చ కంటేముఖ్యం బవిష్యత్తు ,విద్యార్థులను అల్లాగే చూడాలి మనమందరం కాలేజి కి చదువు కోసం పోతున్నాము కనీ స్సరదా కోసం కాదు అనే విషయం ఈ కా లేజిలు గుర్తించాయి ,టీచర్లు సైతం చాలా బాగా చెప్తున్నారు ,కాబట్టి కార్పరేట్ కాలేజిలు వర్దిల్లాలి
అమ్మాయిలకు అబ్బాయిలలో నచ్చని విషయాలు
౧.అబ్బాయిలు మరీ వ్యక్తిత్వం లేకుండా ప్రవర్తించడం .
౨.మరీ ఎక్కువసేపు నస పెట్టడం
౩.తన ప్రైవేటు పర్త్స్ వంక అదే పనిగా చూడడం .
౪.తన ఫ్యామిలీ మేమేబెర్స్ గురంచి తక్కువచేసి మాట్లాడ్డం
౫.మరీ ఎక్కువగా మేక్అప్ అవ్వడం
౬. అస్సలు నచ్చని విషయాల గురంచి ఎక్కువసేఅపు మాట్లాడ్డం
౭.మరీ నీరస్సం గా ఉండడం
౯.జోక్స్ వేయలేక పోవడం .
౧౦.ప్లీసింగ్ గా మాట్లాడ్డం రాకపోవడం
౧౧.ఎక్కువసేపు వాదించడం
౧౨.వినడం రాకపోవడం
౧౩.కళ్ళ లో కి చూసి తడబడడం ]
౧౪.ఆత్మ విశ్వాసం లేక పోవడం
౧౫.విలువలు లేకపోవడం
౧౬.తన గురించి ( అబ్బాయి గురించి ) సెల్ఫ్ డబ్బా కొట్టడం
౧౮.ఇంతెరెస్తింగ్ గా కబుర్లు చెప్పలేక పోవడం
౧౮.నిజాయితి లేక పోవడం
౧౯.ట్టూ ముచ్ ఫ్లెక్షి బుల్ కావడం ]
౨౦.ఎదుటివారిని గౌర విన్చలేకపోవడం
౨౧.సోమరి పోతులను
పై వారిని ఎ అమ్మాయి ఇష్టపడదు
ఫిజికల్ బ్యూటీ వీటన్నిటి తరు వాత వస్తుంది
పుట్ట గొడుగుల కూర తయారుచేయడం
కావాల్సిన దినుసులు ,
అర కెజిపుట్ట గొడుగులు
నూనె రెండు వందల గ్రాములు
కారంతగినంత
ఉప్పు తగినంత
మసాల ( గార్లిపేస్టు )
వడియం కొద్దిగా
కొత్తిమీర
కరివేపాకు
తయారు చేయు విధానం :
ముందుగా పుట్టగొడుగులను తగినంత ముక్ల్కలుగా కోసుకొని నీటిలో శుబ్రంగా కడుక్కోవాలి
పెఅనుం ని స్టవ్ మీద ఉంచి కొద్దిగా తగినంత నూనె పోసుకొని తరువాత బాగా మంటపెట్టి అందిలో పుట్టగొడుగు లు వేయాలి , కొద్దిగా వేగనిచ్చ్చి అందులో కొత్తిమీర మరియు ఉప్పు వేయాలి .బాగా వేగనిచ్చి అందులో గార్లి పేస్టు వేఅసి బాగా కలియబెట్టాలి .అప్పుడు వడియం ఉన్నట్లయితే అందులో వేసి బాగా కలియబెట్టి తరువాత కారం వేసుకొని నీళ్లు తగినంతగా పోసుకొని బాగా ఉడకనివ్వాలి .ఉదికినతరువత దించుకోవాలి
ఇదే పుట్టగొడుగుల కూర
30, అక్టోబర్ 2008, గురువారం
దీపావళి
చివరికి మన తెలుగు సంస్కృతి ని కూడా మరిచి పోయి మన డ్రెస్సింగ్ , మాటలు ,పాటలు ,పండగలు ,అన్నీ పరాయీకరణ చందు తున్నాయి కాబట్టి దయచేసి మన స్టైల్ వదలవద్దని ప్రార్థన .
మన లంగా వో ని ని చుడిదార్ ,జడని లూస్ హెయిర్ , తెలుగు ని హిందీ ,మన అమ్మాయిలకి బొట్టు ,కాటుక,గాజులు అన్నీ నార్త్ ఇండియన్ స్టైల్ అయిపోతున్నాయి .కాబట్టి దయచేఅసి మన తెలుగు సంశ్ర్క్రు తి ని కాపాడండి .
మహేష్ బాబు ఫ్యాన్
నా గురించి ముందుగా
ఈ బ్లాగిలు వాటి గురంచి నాకు అసలు రాదు ,
నేను చార్టెడ్ అక్కౌన్తన్క్య్అనేచదువు మరియు ఆర్టికల్స్ చేస్తున్నాను కాబ్బట్టి నేను కస్టపడి పని చేఅస్తున్నాను అని అందరికీ బిల్డ్ అప్ ఇస్తూ నెట్ బ్రౌసింగ్ చేఅసుకుంటూ కాలం గడిపుతూ ఉండగా పొరపాటుగా ఇందులో పడ్డాను .
ఇక ఫైలింగ్ అయి పోవడం వల్ల చాలా ఫ్రీ గా ఉండడం వల్ల ఈ పని లోకి దిగాను
ప్రస్తుతానికి ఇంతే మరి ఉంటాను శలవు