15, నవంబర్ 2008, శనివారం

మా ఊరూ పాడుబడి పోయా

నాకు సిన్నప్పుడు జరిగిన ఇవరాలు ఇంకా గుర్తున్డాయి , మా ఊర్లో మొత్తం గా యాభై ఇండ్లుండే అందురూ కలిసి మెలిసి బతకతావుండ్రి , ఏమైందో ఏమో సూస్తా సూస్తా వుండం గానే , ఊరు మొత్తం గా కాలీఅయిపోయా ,ఎవురు యాడికి బోయినారో తెలవకనే బోయ , మా నాయినతో సదువుకోన్నోల్లుఉద్యోగాలకోసం సిత్తూరి కి పొయ్యి ఆన్నే సెటిలేఅయిపోయ్యిరి , కొందురుతిరుపతి కి బొయ్యి ఆడ సెటిల్ అయిపోయ్యిరి , ముసిలోళ్ళు మాత్రం మిగిలిపోయ్యిరి , పుట్టిన పిలకాయిలు , వాళ్ల వాళ్ల వౌల్లను సూడకనే యాడనో ఒకసోట బతకతా వుండారు , మిగిలిన పిలకాయలు ఇండ్లల్లో నించి బయిటికి రాకుండానే కోళ్ళు మాదిరి బతకతావుండారు , ఆడు కునేదానికి మేము సిన్నప్పుడు ఈదల్లోగుంపు జేరతా వుంటిమి , డిషుటీవి లు వచ్చేస ఇంకాయాడున్డాయి ఆ ఆటలు , మేము సిన్నప్పుడు జిల్లం గట్టె ,సలాట , కబాడీ , ఇంకా ఎన్ని ఆటలు ఆడతావుంటిమిఅన్నీ పోయా ,
ఇస్కోల్లో ఆటల పీరియడ్డు వుండే అవి గూడా పోయా , ఇప్పుడు పిలగోల్లు సిత్తూరు లో సదవతావుందారు , ఇంగ్లీషు మీదియమ్ము లో సదవతావుండారు
సూస్తా సూస్తా వుండగానే కాలం మారిపోయా , పాతకాలం ఇండ్లు మొత్తం గా పడిపోతావుండాయి , కరువు పెరిగిపూయా బావుల్లో గాదు , బోరాల్లో గూడా నీళ్లు లకుండాబోయ్యినాయి , అందురూ ఎట్టబతకాలఅందుకే , ఒకూకరుగా బెంగుళూరు కు బొయ్యి బతకతా వుండారు , ముందుగా బోయ్యినోల్లకు అంతో ఇంతో మిగులుబాటయ్య ఇంకా ఊళ్ళో నే ఏదో polliddam అనే వాళ్లు వుండారు , పిలకాయలు సంతోషం గా యాడ బతకతా వుండారు , ఒకోకడికి మార్కులు , యమ సెట్టు రాంకులు , ఇంక ఆనదం యాడిథి , ఏమి బతుకయ్యి పోయ , ఇంక పైన ముందు మాదిరి బతకలేమ, బతుకంతా గుడ్లకి , అన్నానికి సిరిపోకపోతే ఏమి మిగల బెట్టాల పిలకాయలకి పెండ్లిళ్ళు ఎం బెట్టి సేయ్యాల ,
ఊర్లో మంగలోడు యాదమూరు లో షాపు పెట్టుకొనే , సాకలోల్లు గుడ్లు ఉతికేది మానేసిరి , పాపం వాళ్లు మాత్రం ఏమి సేస్తారు , సిత్తూర్లోఅయితే ఒక జతకి మూడు , నాలుగు రూపాయలు వస్తాయి, ఊర్లో అయితే మేర తో ఎట్లా బతికేది , ఊరు పాడు బడిపోయ

1 కామెంట్‌:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

అన్ని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.
పదనిర్ధారణను దయచేసి తీసివేయగలరు.మీకు ఒకవేళ తెలియకపోతే ఈ క్రింది టపా చూడండి.
http://tolichiniku.blogspot.com/2008/09/word-verification.html