అసలు కాపీలు కొట్టడం రాని దద్దమ్మ లున్న విష్ణు ప్రియ ఇస్కోల్లో నేను ,ముప్పురోల్ల కిరణ్ గోడు ,సలగుండ్లోల్లమోహన్ గోడు సేరగానే పరిస్తితులు మారిపొయినాయి , అసలు సలగుండ్లోల్ల మోహన్ గోడు మా తో కలిసేవాడు గాదుఎంతసేపూ వాడు పుస్తకాలతో ,ఆవులతో నే పని ఆడమారి నాయాలికి , ఇంక మేము ఏడోక్లాసు దాకా చెడ్డి ల తో తిరిగినోల్లము ,ఎనిమిద్చో క్లాసు లో పాంట్లు ఏసుకొని , అప్పుడు మా నాన్న కొత్త గా ఒక సైకులుతీఇచ్చినాడు , అయితే సైకిలు పాతదే , నేను మిగిలిన నాయాండ్లుఅంతాసైకిళ్ళ పోటీ లు పెట్టుకుంటూ ఎదో మా మానన మేము బతకత ఉంటే , ఇంతలో పదో క్లాసు వొచ్చేసింది ,
టయాలుబాగలేక మా పెద్ద ఇవోరు రిటైర్డ్ అయిపోయ్యినాడు ,ముందే సేప్తున్నారు , పెద్ద ఇవోరు రిటైర్డ్ అయిపోతే మీ పని ఇపోతిందని ,మాకు గూడా బయ్యం గానే ఉండే , పెద్ద ఇవోరు అంటే మా ఇస్కూలు హెడ్డు
3, నవంబర్ 2008, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి