3, నవంబర్ 2008, సోమవారం

నేను - పద్మనాభ ఐఒరు

ఇదో పెద్ద కథ ,పద్మనాభ ఐఒరు అంటే మాటలు గాదని ముందే సెప్పిననుగద అల్లాంటి ఆయనకు నాకు టగ్గుబడిపోయ
నేను రెండో క్లాసు లో వుండగా, మా వూర్లో ఇస్కోల్లో ఇవోర్లలో రెండు గ్రూప్లు వుండే
౧. ఎర్రమేడం (విజయ ప్రభ దేవి ), లెక్కల ఐఒరు (సోమశేఖర్ ),సోషయాల్ఐఒరు (నరసింహులు శెట్టి)
౨.నల్ల మేడము(మనో రంజని), హెడ్ మాస్టారు ,
వీళ్ళల్లో మనకు పస్టు గ్రూపు తో లిన్కెక్కువ సరే ఒకదినం మా వూరు రాధా గోడు ఇస్కోలు పక్కనే వున్న పుల్లయ్య గారి ఇంటి పక్కన కుచ్చోని పారీస్చ పేపెర్లు కాపీ కొడతా వుంటే నేను సల్లగా లెక్క ల ఇవోరికి సేప్పస్తి,అంతే వాడి వొళ్ళు వూదిపోయ్యింది , అంతే వాడు నా మీద కచ్చ పెట్టుకొని హెడ్మాస్టారు కి పురక్క్న్చినాడు ,
ఆ పొద్దు నేను ఇస్కోలుముందర కుచ్చోని రాసుకుంటా వుంటే , గుట్టకింద్దూరునిత్య గోడు , గాండ్లోల్ల మురళి గోడు , రాధా గోడు నను సూపించినారు , నాకు గుండె కాయజారిపోయా , స్వామి గబగబా నాలుగు మొక్కులు మొక్కితి , నా మాట ఇంట్లో నే ఎవ్వురూ పట్టించుకోరు అట్లాంటిది అయన ఎందుకు పట్టిచుకుంతాడు, నేను ఇంటిపాటం రాసు కుంటా వుంటే హెడ్ మాస్టారు వచ్చి ఏఁ వైయ్ ఎట్టా వుండాది ఒళ్ళు అనే ,అంతే నాకు ఒణుకు బుట్టె

2 కామెంట్‌లు:

dhrruva చెప్పారు...

హెడ్మాస్టారు కి పురక్క్న్చినాడు

:))))

కొత్త పాళీ చెప్పారు...

బాగా రాస్తున్నారు.
కొన్ని సూచనలు:
స్పెల్లింగు మీద, మాటలకీ, వాక్యాలకీ మధ్య ఉంచ వలసిన ఖాళీల మీదా కొంచెం దృష్టి పెట్టండి.
ఒక టపాకీ, ఇంకో టపాకీ మధ్య ఏమీ లింకు ఉన్నట్టు కనబడ్డం లేదు. కథ మధ్యలో ఎక్కడకో గంతు వేసేసింది.