2, నవంబర్ 2008, ఆదివారం

నేను ఎస్ .పి.ఎల్

నేను మా వుళ్ళో సిన్నప్పుడి నుంచీ అంటే బాలవడి నుంచీ సడువుకున్తావుంటిని. బాలబడి అంటే మన ఇస్తా రాజ్యంఅని అందరూ అంకుంటాఉంటారు , ఏలంటే ఆడ ,టీచరు మా సిన్నవ్వ .పేరుకే అవ్వ కాని నన్ను ,మా అత్త కొడుకు నరేష్ గాడిని మాయవ్వ ములాజులేకుండా ఉతికి ఆరేస్తా ఉండే ,మేడమ్మ మనవళ్ళుగా మా మీద శానా బరువు బాద్యతలుండే ,మేము అసలు శానా సక్కగా సదువుకోవాలిలేక పోతే మాయవ్వ ఇంట్లో కూడా పాఠాలు సేప్తాది కాబట్టి మేము శానా కష్టపడత ఉంటిమి .ఇస్కూలు అవగానే పిలకాయలంతా ఇండ్లకు బోతా ఉంటే మేము గుక్కు మిక్కని ,టూసన్లోగుచ్చూని సాయంత్రంబస్సు కోసం వాయిటింగ్ సేస్తా ఉంటాము ,ఎలేంటే సాయంత్రం ఉర్లోబస్సు వస్తే గానీ మాయవ్వ టూషణ్వదిలి పెట్టదు , ఇవ్వన్నీ గాకుండా ఆదివారం ఇంట్లో లెక్కల ట్యూషన్ ,మనం లెక్కల్లో క్లేవేర్మి కాదు కాబట్టి ఇంక తప్పక లెక్కలు సేస్తా ఉంటిమి ,దీంట్లో మా నరేష్ గోడు బెట్టరువాడికి లెక్కలు బాగా వస్తాయి ,

సూస్తా సూస్తా ఉండగానే నేను బాలవాడి దాటి పెద్దిస్కోలులోకి వచ్చేస్తేమి ,ఆ పొద్దు మన స్టిల్లు సూడల్చిందేగానీ సేప్పలేము ,అప్పిడికేమాయన్న యాదమూరులో కానిమెంటుకు పోతా వుండే ,అసలు మనం గూడా ముందు కానిమెంటు లో నే సేరినా,మన కు బోరుబండి అంటే శానా ఇష్టం కాబట్టి అదే కావాలని శ్రీదేవి మేడం ని తిట్టి తన్ని ,మాయన్నని తన్నించి ఇస్కూలుకి నిల్చి పోయి శానా శానా కతలు సేస్తిమి కాబట్టి ,వీణ్ణి ఊర్లో ఇస్కోల్లో నే పెట్టాలని ఇంట్లో అనుకుని దీన్లూ పడదోసిరి . మనం చానా చానా క్లేవేర్ మీ కాబట్టి ఒకటో వచ్చేస్తిమి ,కానీ లోపల కొంచం బయం గానే ఉండే ఏలనంటే మా పెద్ద ఇకలాసు సధవకుండా రెండో కలాసు లో కి వచ్చే స్తిమి గానీ ఐ స్కోలులో హెడ్డు మాస్టారు ఎవరను కున్న్యారు ,పద్మనాభ నాయుడు .

కామెంట్‌లు లేవు: