13, డిసెంబర్ 2008, శనివారం

వేయి జన్మల పుణ్యం మన ప్రభుత్వ పాలన

నిజం నిజం గా నిజం , నమ్మరా , నమ్మాలి , తప్పదుఇంకో మార్గం లేదు , వేయి జన్మల పుణ్యం మన ప్రభుత్వ పాలన , ఆనాడు శ్రీ కృష్ణ దేవ రాయలు ఆస్థానం లో అష్ట దిగ్గజాలు ఉన్నారో లేదో కానీ ఈనాడు ఈ ఆంధ్ర భూజుడు ,వై . ఎస్ పాలనలో మనకు అష్ట దిగ్గజాలు ఉన్నారు ,

౧. ఆశుకవి మారెప్ప
౨. నిష్కపటి ఎం . సత్య నారాయణ్ రావ్
౩.ఉపమాన విశారదుడు శ్రీ శ్రీ రఘు వీరా రెడ్డి
౪. పిట్టకథల రోశయ్య
౫. ఊహా శీలి శ్రీ శ్రీ జే .సి దివాకర రెడ్డి
౬. క్లిష్ట పద పితామహుడు శ్రీ శ్రీ జానా రెడ్డి
౭.భారీ పద ప్రయోగి శ్రీ శ్రీ పొన్నాల లక్ష్మణా చార్యుడు
౮.మత్త గజం శ్రీ శ్రీ బొత్స సత్య నారాయణ

4 కామెంట్‌లు:

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

బాగుంది సుధీర్! మీరు రాసే విధానం లో మెల్లగా మార్పు వస్తుంది... మంచి మార్పే!

రానారె చెప్పారు...

:-))

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది. ఇవాళే, మీ పాత టపాలు చూసాను. చిత్తూరి మాండలికం లో, పల్లె యాస తో మీరు వ్రాసిన సంగతులు బాగా నచ్చాయి, చదువుతుంటే, స.వెం.రమేష్ గారు వ్రాసిన ప్రళయ కావేరి కథలు, ఖధీర్ బాబు వ్రాసిన పోలేరమ్మ బండ కథలు ఒకేసారి గుర్తొచ్చాయి. ఎందుకంటే, రమేష్ గారు వాడిన మాండలికం, ఖదీర్ బాబు శైలి రెండూ కలిసినట్లున్నాయి మీ టపాలు. వాటిని కొనసాగించాలని మనవి.

ఏకాంతపు దిలీప్ చెప్పారు...

హే సుధీర్, నేను భాష గురించి చెప్పింది కేవలం రాసే విధానం గురించి మాత్రమే... యాస గురించి కాదు, మీ యాసలో మరిన్ని ఆశిస్తున్నాను...