కాలెజీ లో ఉన్నన్నాళ్ళూ చదువులు ఎప్పుడు అయిపొతాయో, పరీక్షల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో, ఉద్యోగం లో చేరి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తామో అని… ఉద్యొగవేటలో నానా తిప్పలూ పడి, నానా గడ్డీ తిని, చివరకు ఎలాగో ఉద్యోగం సంపాయిస్తాం।
ఉద్యోగం లో జాయిన్ అవుతాం మొదటి నెల: పని తక్కువ – ఎంజాయ్ ఎక్కువ – ఆల్ హాపీస్రెండో నెల: పని – ఎంజాయ్ – ఓకేమూడో నెల: పని – పని – నో ఎంజాయ్ – సమస్యలు మొదలు ...అప్పటికి ఆఫీసు రాజకీయాలు తెలుస్తాయి.పక్క టీము మేనేజర్ మంచోడు అవుతాడు.పక్క టీము లో అమ్మాయిలు\అబ్బాయిలు బాగుంటారు.పక్క టీము లో జీతాలు తొందరగా పెరుగుతాయిపక్క టీము లో అస్సలు పనే ఉండదు.మనకి మాత్రం రోజూ దొబ్బించుకోవటమే…ఒక్కొక క్లయింటు ఎమో పిచ్హి నా Requirements ఇస్తాడు. అవి పని చెయ్యవని తెలిసీ అలానే చెయ్యాలి.వాడిని అమ్మనా బూతులూ తిట్టి వెళ్ళిపొదాం అనిపిస్తుంది.కాని ఆ ఆఫీసులో నెట్ , కాఫీ ఫ్రీ అని గుర్తుకొస్తుంది.
మనలాంటి వాళ్ళ తో ఒక బాచ్ తయ్యారవుతుంది. వారానికి ఒకసారి మందు కొట్టి మన PLని TLని తిట్టటం మొదలు పెడుతాం. అలా ఆరునెలలు గడిచిపోతాయి.ఇక లూపు లో పెట్టి కొడితే రెండు సంవత్సరాలు గడచి పోతాయి. కళ్ళ క్రింద నల్ల చారలు, వలయాలు… వళ్ళు నొప్పులు.. మెడ నొప్పులు… వేళ్ళు వంకర్లు… వగైరా…అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు వీళ్ళందరినీ చుట్టపు చూపుగా కలవాల్సొస్తుంది। వీళ్ళల్లొ ఎవరైనా మనలాంటి ఉద్యోగం లో ఉంటే మన పరిస్థితి అర్థమవుతుంది. లేకపోతే… ఫోను చేసిన ప్రతిసారీ సంజాయిషీ చెప్పుకోవాలి….
వచ్చిన జీతాన్నంతా క్రెడిట్ కార్డుల బిల్లులలకి, తాగటానికి తగలేస్తాం. ఈ జీవితం అలవాటయిపొతుంది. అలా జీవితం ప్రశాంతంగా గడచి పొతుడగా ఒకరోజు మన కొలీగు తన పెళ్ళి అని పిలుస్తాడు. మనకి కూడా పెళ్ళి చేసుకోవాలనే వెధవ ఆలోచన ఒకటి పుడుతుంది. మన S/W లో అమ్మాయిలంతా పెళ్ళి అయినోళ్ళు, ఆల్రడీ కమిట్ అయినోళ్ళు లెకపొటె ఉత్తర భారత దేశపు వాళ్ళు అయి ఉంటారు. వందలో తొంభయైదు మంది పోగా… మిగిలిన అయిదుగురి లో నలుగురు అక్క అంటే నే బెటర్ అనే లాగా ఉంటారు.
ఇక మిగిలింది ఒక్కరు. ఆ ఒక్క అమ్మాయికోసం, టీం అంతా ఊరకుక్కల్లాగా కొట్టేసుకొంటాం.ఆ అమ్మాయి మాత్రం, ఎవ్వరి తోనూ కమిట్ కాకుండా, అందరితొ పబ్బం గడిపేస్తూ ఉంటుంది.ఒక మంచి రోజు చూసి, నాకు మా బావ తో పెళ్ళి అని పెళ్ళి పత్రికలు పంచుతుండి.మనమదరం, ఆ అమ్మాయి మంచిది కాదు అని డెసైడు చేయటానికి మందు కొడతాం.ఇంకొక అమ్మాయి కోసం ప్రయత్నాలు మొదలు.
ఉద్యోగం లో reviews వస్తాయి. “నువ్వు ఎక్సలెంట్..నువ్వు లేనిదే మా కంపెనీ లేదు… కత్తి కమాల్…“లాంటివెన్నో చెపుతారు.చివరలో… “కానీ…” అని ఒక్క మాటతో గాలి తీస్తారు…నీ జీతం లో ఒక శనక్కాయ పెంచాం ఫొ! అంతారు. మనం సణుక్కొటూనె…అదే శనక్కాయల మీద బ్రతికేస్తుంటాం….జీవితం అంతా దూరదర్సన్ ప్రసారాలలానే ఉంటుందా…??
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
3 కామెంట్లు:
అదిరింది గురూ, మరి పెళ్ళి చేసుకో ఆ తరువాత ఆఫీస్ లైఫే బగుంటుంది అనుకుంటావు ఏదో ఒక రోజు.
పెళ్లి కెందుకు తొందర? వయస్సు 23 ఏళ్లేగా! ఒక మూడేళ్లాగితే సరి, పెళ్లి గురించి ఆలోచించవచ్చు. నీకు నచ్చిన అమ్మాయి దొరక్కపోదు.నిశ్చింతగా ఉండు. జీవితందూరదర్శన్ కాదు, నవరంగ్ అని అనుభవం మీద చెప్తావు. శుభం.
P.S. Please remove word verification.
-cbrao
San jose,CA.
కామెంట్‌ను పోస్ట్ చేయండి