22, నవంబర్ 2008, శనివారం

సాక్షి

ఈ సాక్షి పేపెర్ ఎందుకు పెట్టాడా , అని అనుకొనెవాన్ని, ఇప్పుడు ఆ సందెహం లెకుందా పొయింది ,దీనిని న్యుస్ పేపెర్ అండం కంటె పాంప్లెట్ అనడం నయం , అసలు వాల్లకు ఇది ఎందుకు ఉపయొగపదుతుందంటె , ప్రథి పక్షాలను ఏకెయడానికి కావచ్చు , కానీ అది తన పరిధి ని అతిక్రమించింది , ఏ పేపెర్ అయినా మీడియా అయినా వ్యక్థుల కుటుంబాల అంతర్గథ , వ్యక్థిగత విషయాలను అలా ప్రచారం చెయడం ఏ రకమైన విలువల క్రిందకు వస్తుందొ వారికె తేలియాలి ,ప్రథి కుతుంబం లొ కలథలు , కలహాలు వుంటాయి కానీ వాటిని స్వార్థ ప్రయూజనాలకు వాడుకొవడం ఏమిటి అసలు ,ఎం ముఖ్య మంత్రి గారి కుతుం బం లొ కలథలు రావా , వాటిని మీడ్యా బయట పేడిథే ఆయనకు పరువు పోధా , ఈ అంధ్ర దెసం లొ అసలు కలథలు , కలహాలు లెని కుటుంబం ఏఅదైనా వుందా , ప్రతి కుటుంబం లో కలతలు వుంటాయి కానీ వాటికి ఎనలేని ప్రాదాన్యం ఇచ్చి నీచ ఎత్తుగడలతో ప్రత్యర్థిని మానసికగా దెబ్బ తీస్తున్నామనుకొనే వాళ్లు నిజానికి మనుషులు కాదు జంతువులు , ఈ సాక్షి నిజానికి పత్రికలలూ చీడపురుగు ,పుబ్బాలో పుట్టి ముఖ లో మాడిపోయే అనేకానేక పేపర్లలో ఈ స్సాక్షి కూడా చేరబోతోంది , మరీ ఇంట బరితెగింపా , వీరికి అసలు సిగ్గూ , లజ్జా వున్నాయా , ప్రముఖుల అంతర్గత జీవితాలూ , పడకగది కబుర్ల తో ఎన్నాళ్ళు వీరు సుర్కులాషన్ పెంచుకుంటారు ,

20, నవంబర్ 2008, గురువారం

దేముడు గారు

మనం రాష్ట్రం లో మనకు తెలియకుండానే , ఉన్నా ముప్పై కోట్ల దేవతలకు బదులు గా, భూమ్మీద ఉన్నదేవతలవంటి బాబాలు , అమ్మలు కాక మిగిలిన స్వామీజీలు , పొద్దున్న ఉపగ్రహ చానల్స్ లో భక్తీ ని భోదించే వారు కాకుండా హటాత్తుగా మరో దేవుడు వెలిసాడు , ఆశ్చర్యి పోకన్ది మనకు ఆ మాత్రం వ్యవధి కూడా ఈ కొత్త దేవుడు గారు ఇవ్వడం లేదు , ఆయనే అభినవ ఏసు శ్రీ శ్రీ శ్రీ రాజ శేఖరుల వరు అవ్వక్కయ్యరా అబ్బే మీకసలు తలీదస్న్ది , అసలు రాష్ట్రం లో అనాలుగు ఏళ్ళు గా జరుగుతున్నది ఎంతనుకున్తున్నారు , దేవుడి పాలన కాదా , కాదని చెప్పకండి , దేవుడుకి కోపం వచ్చేస్తుంది , ఆయనగారి మంత్రివర్యులు రోశయ్య గారు , కిరణ్ కుమ్మార్ రెడ్డి గారు , రఘువీరా రెడ్డి గారు అడ్డసం గా నోరు చేసుకొని మీ మీద పడిపో గలరు , కాబట్టి ఒప్పుకుని తీరవలసిందే ,
దేవుదిపాలనలో ఏమి అయినా జరగవచు , జైళ్లలోదుష్ట సిస్క్ష న , శిష్ట రక్షణ జరగవచ్చు , ముఖ్య మంత్రి గారు పైళ్ళు చూడకుండా సంతకం పెట్టియ్యవచ్చు , ఫ్ల్య్ ఓవర్లు కూలి భూమాత భారం తగ్గవచ్చు , కాకుంటే చేనేత కార్మికులు , కానీ లేక రైతులు కానీ దేవుడి కి కష్టం లేకుండా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవచ్చు ,
మ్మాట్లాడితే దేవుడికి కోపం వచ్చేస్తుంది , అసెంబ్లీ లో సైతం ప్రతిపక్ష నాయకుణ్ణి అమ్మనా బూతులు తిట్టగల మొనగాడు ,

15, నవంబర్ 2008, శనివారం

మా ఊరూ పాడుబడి పోయా

నాకు సిన్నప్పుడు జరిగిన ఇవరాలు ఇంకా గుర్తున్డాయి , మా ఊర్లో మొత్తం గా యాభై ఇండ్లుండే అందురూ కలిసి మెలిసి బతకతావుండ్రి , ఏమైందో ఏమో సూస్తా సూస్తా వుండం గానే , ఊరు మొత్తం గా కాలీఅయిపోయా ,ఎవురు యాడికి బోయినారో తెలవకనే బోయ , మా నాయినతో సదువుకోన్నోల్లుఉద్యోగాలకోసం సిత్తూరి కి పొయ్యి ఆన్నే సెటిలేఅయిపోయ్యిరి , కొందురుతిరుపతి కి బొయ్యి ఆడ సెటిల్ అయిపోయ్యిరి , ముసిలోళ్ళు మాత్రం మిగిలిపోయ్యిరి , పుట్టిన పిలకాయిలు , వాళ్ల వాళ్ల వౌల్లను సూడకనే యాడనో ఒకసోట బతకతా వుండారు , మిగిలిన పిలకాయలు ఇండ్లల్లో నించి బయిటికి రాకుండానే కోళ్ళు మాదిరి బతకతావుండారు , ఆడు కునేదానికి మేము సిన్నప్పుడు ఈదల్లోగుంపు జేరతా వుంటిమి , డిషుటీవి లు వచ్చేస ఇంకాయాడున్డాయి ఆ ఆటలు , మేము సిన్నప్పుడు జిల్లం గట్టె ,సలాట , కబాడీ , ఇంకా ఎన్ని ఆటలు ఆడతావుంటిమిఅన్నీ పోయా ,
ఇస్కోల్లో ఆటల పీరియడ్డు వుండే అవి గూడా పోయా , ఇప్పుడు పిలగోల్లు సిత్తూరు లో సదవతావుందారు , ఇంగ్లీషు మీదియమ్ము లో సదవతావుండారు
సూస్తా సూస్తా వుండగానే కాలం మారిపోయా , పాతకాలం ఇండ్లు మొత్తం గా పడిపోతావుండాయి , కరువు పెరిగిపూయా బావుల్లో గాదు , బోరాల్లో గూడా నీళ్లు లకుండాబోయ్యినాయి , అందురూ ఎట్టబతకాలఅందుకే , ఒకూకరుగా బెంగుళూరు కు బొయ్యి బతకతా వుండారు , ముందుగా బోయ్యినోల్లకు అంతో ఇంతో మిగులుబాటయ్య ఇంకా ఊళ్ళో నే ఏదో polliddam అనే వాళ్లు వుండారు , పిలకాయలు సంతోషం గా యాడ బతకతా వుండారు , ఒకోకడికి మార్కులు , యమ సెట్టు రాంకులు , ఇంక ఆనదం యాడిథి , ఏమి బతుకయ్యి పోయ , ఇంక పైన ముందు మాదిరి బతకలేమ, బతుకంతా గుడ్లకి , అన్నానికి సిరిపోకపోతే ఏమి మిగల బెట్టాల పిలకాయలకి పెండ్లిళ్ళు ఎం బెట్టి సేయ్యాల ,
ఊర్లో మంగలోడు యాదమూరు లో షాపు పెట్టుకొనే , సాకలోల్లు గుడ్లు ఉతికేది మానేసిరి , పాపం వాళ్లు మాత్రం ఏమి సేస్తారు , సిత్తూర్లోఅయితే ఒక జతకి మూడు , నాలుగు రూపాయలు వస్తాయి, ఊర్లో అయితే మేర తో ఎట్లా బతికేది , ఊరు పాడు బడిపోయ

9, నవంబర్ 2008, ఆదివారం

ఆశలు- కోరికలు

జీవితం లో మనం ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక దాని గురించి ఆసపదతాం కానీ దానిని దక్కించుకోవడానికి కానీ అనుకొన్న విజయాన్ని సాదిన్చుకోవడానికి ఎంత కృషి చేస్తున్నామో అసలు ప్రయత్నం చేస్తున్నామో లేదో తెలీదు
అసలు ఒక కోరిక కోరినాముఅంటే ఆ కోరిక ఎంత బలమైన దిఅయుండాలంటే మన మనసు శరీరం ,హృదయం నరనరాల్లో ఆ కోరిక జీర్నించుక పోవాలి , మన తల నుంచి కాళ్ళ వరకు ఆ కోరిక మన రక్తం తో కలసి ప్రవహించాలి ,
ఆ కోరిక అనుస్చనంమన ను ముందుకు నడిపించాలి , మన కోరిక మన ఊపిరిగా మారినపుడు మన హృదయాన్ని రగులుస్తున్నప్పుడు , మన ఉస్వాస నిస్వాసల్లో కరిగిపోయినపుడు , మన మనసును తనలో ఇముడ్చుకున్నప్పుడు , ప్రతి సెకను తన లక్ష్య సాదన వైపు మనల్ని ముందుండి నడిపిస్తుంది , మన ప్రతి చర్య తానె నిర్దేశిస్తుంది , మన పొరపాట్లు మన సోమరితనాలు , మన ఆవేశాలు ,ఆందోళనలు ప్రతిదీ మన లక్ష్య సాధనలో సోపానాలుగా మన జీవితాని సాసిస్త్తాయి ,విజేత అవ్వాలంటే అందరినీ అదికమించాలంటేవారందరి కంటే లక్ష్యం పట్ల మనకు గురి ఎక్కువ వుండాలి , వారందిరిని అధికమించాలంటే వారందరికంటే మనకుసంకల్పబలం ఎక్కువ వుండాలి , లక్ష్య సాధన పట్ల మనకు తరగని ప్రేమ వున్నపుడు మన కు ఎదు రయ్యే ప్రతి సమస్య మన శక్తీ యుక్తులను పదును పెడుతుంది , ఎక్కడైతే ప్రేమ ఎక్కువ వుంటుందో అక్కడ అలసత్వానికి , సోమరితనానికి , అలసతకి తావు లేదు , ఎక్కడైతే మన మనసు పూర్తి గా మన ఆశయం తో నిండి పోతుందో అక్కడ మరో వైఖరికి తావులేదు ,
అసలు మన లక్ష్య సాధనలో మన మనసు , శరీరం , మెదడు , ఆత్మ మమేకం అవుతుందో అక్కడ వేరే రకమైన వైఖరి కి తావులేదు , మన లక్ష్య సాధనలో మనం కాస్త వెనక పది పోవచ్చు గాక కానీ మన ఆత్మ ,శరీరం లక్ష్య సాదన వైపు పరుగులు తీస్తున్నప్పుడు మనం మనసు ఆటో మాటిక్ గా తన పొరపాట్లను తన డ్రా బక్లను తన ఆశయం తో మేళవిస్తుంది , మన లక్ష్యం మనకు తెలిసినప్పుడు మన శరీరం మనసు daaniki సిద్దపడుతుంది
నీ ఆశయం నీ జీవితం కావాలి , నేఎ అనువనువులూ అది నిండి పోవాలి నీ జీవితాని అది పూర్తి గా అక్రమించాలి , నీ పొరపాట్లు , ఆత్మ నూన్యతలు , నీ ఆవేశాలు , నీ ఆశయాలు పూర్తి గా నీ ఆశయం వైపు మళ్ళించబడుతుంది , నీ కు నేలక్షీఎంత ప్రియమైనది అవ్వాలంటే అది నీ పోటీ దారులను కాదు నీ కు నువ్వే పూటే అయ్యే లా చేస్తుంది ,

8, నవంబర్ 2008, శనివారం

జీవితం

కాలెజీ లో ఉన్నన్నాళ్ళూ చదువులు ఎప్పుడు అయిపొతాయో, పరీక్షల నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందో, ఉద్యోగం లో చేరి డబ్బులు ఎప్పుడు సంపాదిస్తామో అని… ఉద్యొగవేటలో నానా తిప్పలూ పడి, నానా గడ్డీ తిని, చివరకు ఎలాగో ఉద్యోగం సంపాయిస్తాం।
ఉద్యోగం లో జాయిన్ అవుతాం మొదటి నెల: పని తక్కువ – ఎంజాయ్ ఎక్కువ – ఆల్ హాపీస్రెండో నెల: పని – ఎంజాయ్ – ఓకేమూడో నెల: పని – పని – నో ఎంజాయ్ – సమస్యలు మొదలు ...అప్పటికి ఆఫీసు రాజకీయాలు తెలుస్తాయి.పక్క టీము మేనేజర్ మంచోడు అవుతాడు.పక్క టీము లో అమ్మాయిలు\అబ్బాయిలు బాగుంటారు.పక్క టీము లో జీతాలు తొందరగా పెరుగుతాయిపక్క టీము లో అస్సలు పనే ఉండదు.మనకి మాత్రం రోజూ దొబ్బించుకోవటమే…ఒక్కొక క్లయింటు ఎమో పిచ్హి నా Requirements ఇస్తాడు. అవి పని చెయ్యవని తెలిసీ అలానే చెయ్యాలి.వాడిని అమ్మనా బూతులూ తిట్టి వెళ్ళిపొదాం అనిపిస్తుంది.కాని ఆ ఆఫీసులో నెట్ , కాఫీ ఫ్రీ అని గుర్తుకొస్తుంది.
మనలాంటి వాళ్ళ తో ఒక బాచ్ తయ్యారవుతుంది. వారానికి ఒకసారి మందు కొట్టి మన PLని TLని తిట్టటం మొదలు పెడుతాం. అలా ఆరునెలలు గడిచిపోతాయి.ఇక లూపు లో పెట్టి కొడితే రెండు సంవత్సరాలు గడచి పోతాయి. కళ్ళ క్రింద నల్ల చారలు, వలయాలు… వళ్ళు నొప్పులు.. మెడ నొప్పులు… వేళ్ళు వంకర్లు… వగైరా…అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు వీళ్ళందరినీ చుట్టపు చూపుగా కలవాల్సొస్తుంది। వీళ్ళల్లొ ఎవరైనా మనలాంటి ఉద్యోగం లో ఉంటే మన పరిస్థితి అర్థమవుతుంది. లేకపోతే… ఫోను చేసిన ప్రతిసారీ సంజాయిషీ చెప్పుకోవాలి….
వచ్చిన జీతాన్నంతా క్రెడిట్ కార్డుల బిల్లులలకి, తాగటానికి తగలేస్తాం. ఈ జీవితం అలవాటయిపొతుంది. అలా జీవితం ప్రశాంతంగా గడచి పొతుడగా ఒకరోజు మన కొలీగు తన పెళ్ళి అని పిలుస్తాడు. మనకి కూడా పెళ్ళి చేసుకోవాలనే వెధవ ఆలోచన ఒకటి పుడుతుంది. మన S/W లో అమ్మాయిలంతా పెళ్ళి అయినోళ్ళు, ఆల్రడీ కమిట్ అయినోళ్ళు లెకపొటె ఉత్తర భారత దేశపు వాళ్ళు అయి ఉంటారు. వందలో తొంభయైదు మంది పోగా… మిగిలిన అయిదుగురి లో నలుగురు అక్క అంటే నే బెటర్ అనే లాగా ఉంటారు.
ఇక మిగిలింది ఒక్కరు. ఆ ఒక్క అమ్మాయికోసం, టీం అంతా ఊరకుక్కల్లాగా కొట్టేసుకొంటాం.ఆ అమ్మాయి మాత్రం, ఎవ్వరి తోనూ కమిట్ కాకుండా, అందరితొ పబ్బం గడిపేస్తూ ఉంటుంది.ఒక మంచి రోజు చూసి, నాకు మా బావ తో పెళ్ళి అని పెళ్ళి పత్రికలు పంచుతుండి.మనమదరం, ఆ అమ్మాయి మంచిది కాదు అని డెసైడు చేయటానికి మందు కొడతాం.ఇంకొక అమ్మాయి కోసం ప్రయత్నాలు మొదలు.
ఉద్యోగం లో reviews వస్తాయి. “నువ్వు ఎక్సలెంట్..నువ్వు లేనిదే మా కంపెనీ లేదు… కత్తి కమాల్…“లాంటివెన్నో చెపుతారు.చివరలో… “కానీ…” అని ఒక్క మాటతో గాలి తీస్తారు…నీ జీతం లో ఒక శనక్కాయ పెంచాం ఫొ! అంతారు. మనం సణుక్కొటూనె…అదే శనక్కాయల మీద బ్రతికేస్తుంటాం….జీవితం అంతా దూరదర్సన్ ప్రసారాలలానే ఉంటుందా…??

7, నవంబర్ 2008, శుక్రవారం

ది వైట్ టైగర్

ఇప్పుడే ఈ పుస్తకం చదవడం ముగించాను ,ఇందులో ఒక వ్యక్తి గురించి ఉత్తమ పురష లో కథ సాగుతుంది ,లక్ష్మణ గర్ అనే ఊళ్ళో ఒక రిక్షా పుల్లేర్ కొడుకు అయిన బలరాంఅనే వ్యక్తి తన నాయనమ్మ ప్రభావం నుంచి తప్పించుకొని చనిపోయిన తన తల్లి తండ్రి జ్ఞాపకాలను వదిలించుకొని ,తన అన్నఅయిన కృష్ణ ను వదిలి పెట్టి ఒకముస్లిం డ్రైవర్ దగ్గర డ్రైవింగ్ నేర్చు కొని తన ఊరి కి చెందిన నక్సల్స్ భయం తో వౌరిని వదిలిపెట్టి పోయి టౌన్లో కోల్ బిజినెస్ చేసే ఒక భూస్వామి దగ్గర డ్రైవర్ గా జాయిన్ అవుతాడు ,అతని కొడుకు అశోక్ ,బార్య పింకి మాడం తో పాడు పన్ను తప్పించుకోవడానికి ఢిల్లీలో లాబీ చేయడానికి ఢిల్లీ కి వారి డ్రైవర్ గా హోండాసిటీ కారును తీసుకొని వెళ్తాడు .అక్కడ ఒక ఆక్సిడెంట్ చేసి అశోక్ తో విడిపోయి పింకి అమిరికా కు వెళ్లి పోతుంది ,ఒంటరి అయిన అశోక్ ను మోసం గా హత్య చేసి ఈ వైట్ టైగర్ గా తనను పిలుచుకొనే బలరాం తనకు తో దు గా వచ్చిన తొమ్మిదేళ్ళ అన్న కొడుకు తో పాటు ఏడు లక్షలతో పాటు బెంగుళూరు కి పారిపోయి అక్కడ కాబ్ లు సంపాదించి వాటిని మైంతైన్ చేసుకొంటూ ఇండియా కి రాబోతున్న చైనా ప్రీమిఎర్ కి తన కథ గురించి వివరించడం ఏడు రాత్రులతో జరుగుతుంది ,మొత్తం గా ఎదే స్టొరీ

ఇందులో అద్బుతం అంటూ ఏమీ లేదు
అసలు ఎందుకు బుకర్ ప్రైజ్ వచ్చిందో నాకు అస్సలు అర్థం కాలేదు
అసలు హీరో లో హీరో లక్షణాలు కాదు కదా స్ఫూర్తి దాయకమైన గుణాలు ఏమీ లేదు
ఎంత సేపూ డబ్బున్న వారిని తిట్టడం తప్ప ఇందులో ఏమీ లేదు
మానవ అంతరంగ కోణాలను సృజించ లేదు
డ్రైవర్ల ఆలోచనల గురించి అసలు అంతా తప్పు తప్పు గా రాసారు

ఐతే ,
సగం వుడికిన ఆలోచనలు అంటూ చాలా కొత్తగా రాసారు
నీవు తాళం చెవి కోసం చాల కలం గా వెతుకుతున్నావు కానే తలుపు తెరిచే వుంటుంది ,అనడం
వొంటరి గా వచ్చే వున్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనల గురించి
మనుషులలో వున్నా అపరాధ భావన గురించి
డబ్బు పట్ల ఆడ వాళ్ల పట్ల మగవాళ్ళలో వున్నా దాచుకునే కోరికల గురించి

చాలా చాలా చక్క గా రాసాడు

4, నవంబర్ 2008, మంగళవారం

ఆడువారి మాటలకూ అర్థాలే వేరులే

మీరు ఈ పాట వినే వుంటారు , ఇంకాసినిమా కూడా చూసి వుంటారు , కానీమీలో చాలా మందికి ఈ మాటల గురించి పూర్తిగా తెలిసి వుండదు ,
ఆడువరిమటలకుఅర్థాలు వేరు కాదు , అసలు లేదులే , అని చెప్పుకోవాలి ,అసలు వారు ఎందుకు మాట్లాడుతారో ,ఎందుకు మౌనంగా వుంటారో , మగాళ్ళు మాట్లాడితే ఎందుకు తిడతారో అస్సలు అర్థం కాదు ,
వాళ్లు అలిగితే మనమే బ్రత్ర్హిమాలుకోవాలి ,మనం అలిగినా మనమే బ్రతిమాలుకోవాలి ,
వాళ్ళతో షాపింగ్ వెళ్ళడమంటే ఇక నరకమే , మనకు పరిచయం వున్నా వాళ్ళు కనిపిస్తే మనం మాటలాదకూడదు , కాని వాళ్ళఫ్రెండ్ కనిపేస్తే గంటలకొద్దీ మాట్లాడతారు , అంట సేపు మనం నిల్చుని దిక్కులు చూస్తూ వుండాలి ,పోనీ వాళ్ళతో మాటలు కలపబోతే అదో ప్రమాదం , వాళ్ళ డ్రెస్ గురించి సమయం సందుర్భంలేకుండా మన అభిప్రాయాలు చెప్పాలి ,కొంచెం పొగిడితే సోప్ వేస్తున్నమంటారు ,పోనీ బాగా లేదంటే అస్సలు టెస్టులేదంటారు , వాళ్లు జోక్ వేస్తె మనం నవ్వాలి కానీ మనం జోక్ వేస్తె ముఖం చిట్లి స్టారు , వాళ్లు పరాయి అబ్బాయిలగురంచి మాట్లాడితే మనం లైట్ తీసుకోవాలంటారు , మనం ఇంకో అమ్మాయి గురించి మాట్లాడితే ఇంకా చచ్చామే , వాలగురించి వాళ్లు చెప్పుకుంటే అది నిజం అంటారు ,మనగ్ఫురించి చెప్పుకోబోతే సెల్ఫ్ డబ్బా అంటారు ,వాళ్ల ఇంట్రెస్ట్ ల గురించి మనం వినాలి మనం చెప్పబోతే బోర్ అంటారు , వాళ్ళని నవ్వించాలి ,లాలించాలి ,తిడితే పడాలి , ఒదార్చాలి ,ఆసక్తి గా కబుర్లు చెప్పాలి , మనని ఫూల్ చేస్తే లైట్ తీసుకోవాలి , వాళ్ళ కోపాన్ని భరించాలి , మనకు కోపం వస్తే మనమే సారీ చెప్పాలి , వాళ్ళకి కోపం వచ్చినా మనమే సారీ చెప్పాలి , ఇంకా వాళ్ల కు మూడ్ వచ్చి నప్పుడల్లా అర్ధరాత్రీ ఆపరాత్రీ లేక ఫోన్ చేసి ఇంకా ఏంటి సంగతులు అంటారు , మనం చచ్చి నట్లు కబుర్లు చెప్పాలి , వాళ్ళకి ఏడుపు వస్తే ఏడుస్తారు మనం ఏడవ బోతే మగాడివి కాదా అంటారు , వాళ్ళకి ఐస్ క్రీమ్ లు , చాక్లెట్లు , ఇంకా నానా చెత్తా కొనివ్వాలి ,

3, నవంబర్ 2008, సోమవారం

సిగ్గు లజ్జా లేని ప్రభుత్వం

ఈ గవర్నమెంట్ కి అసలు సిగ్గు లజ్జా అసలు వున్నయ్యా అనిపిస్తోంది ,నాలుగేళ్ళ క్రితం ,ప్రజలు కస్టాలు పడితున్నారని వారిని కాపాడడానికి తన ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్దం గా ఉన్నానని చెప్పుకొన్న రాజశేఖర్ రెడ్డి చివరికి దిగజారి పోయి ఎన్నో హత్యలకు కరాన్మయ్యి దాదాపు ఐదువేల మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకొన్న పట్టించుకోక నిర్లజ్జ గా రాజీవ్ ఇందిరా ల నమ స్మరణ చేసుకుంటూ అక్రమ ఆస్తులు కూడక్బెట్టుకుంటూ ,రాష్ట్రాన్ని సర్వనాసనం చేస్తూ బతుకుతున్నాడు , ఛీ ఆయనదీ ఒక బతుకేనా ,ఎవరేం మాట్లాడినా వ్జారిమీద ఎదురుదాడి చేయడం ,పత్రికలను తిట్టడం , తగులబెట్టడం , అందరినీ ఎద్దేవా చేయడం ,ప్రజలు పిచ్చివాళ్ళని అనుకుంటున్నాడు కాబోలు , తన కులస్తులను మాత్రమే ప్రోస్తాహించడం , వారికే అన్ని పదవులు కట్ట బెట్టడం , రాస్తానని చివరికి రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ గా మరుస్తాదేమోలక్ పోతే రాజీవ్ ప్రదేశ్ గా , లేక ఇందిరా ప్రదేశ్ గా మరుస్తున్నదేమో ,

ఇష్ను ప్రియ ఇస్కూల్లో మా కాపీ ల కథలు

అసలు కాపీలు కొట్టడం రాని దద్దమ్మ లున్న విష్ణు ప్రియ ఇస్కోల్లో నేను ,ముప్పురోల్ల కిరణ్ గోడు ,సలగుండ్లోల్లమోహన్ గోడు సేరగానే పరిస్తితులు మారిపొయినాయి , అసలు సలగుండ్లోల్ల మోహన్ గోడు మా తో కలిసేవాడు గాదుఎంతసేపూ వాడు పుస్తకాలతో ,ఆవులతో నే పని ఆడమారి నాయాలికి , ఇంక మేము ఏడోక్లాసు దాకా చెడ్డి ల తో తిరిగినోల్లము ,ఎనిమిద్చో క్లాసు లో పాంట్లు ఏసుకొని , అప్పుడు మా నాన్న కొత్త గా ఒక సైకులుతీఇచ్చినాడు , అయితే సైకిలు పాతదే , నేను మిగిలిన నాయాండ్లుఅంతాసైకిళ్ళ పోటీ లు పెట్టుకుంటూ ఎదో మా మానన మేము బతకత ఉంటే , ఇంతలో పదో క్లాసు వొచ్చేసింది ,
టయాలుబాగలేక మా పెద్ద ఇవోరు రిటైర్డ్ అయిపోయ్యినాడు ,ముందే సేప్తున్నారు , పెద్ద ఇవోరు రిటైర్డ్ అయిపోతే మీ పని ఇపోతిందని ,మాకు గూడా బయ్యం గానే ఉండే , పెద్ద ఇవోరు అంటే మా ఇస్కూలు హెడ్డు

నేను - పద్మనాభ ఐఒరు

ఇదో పెద్ద కథ ,పద్మనాభ ఐఒరు అంటే మాటలు గాదని ముందే సెప్పిననుగద అల్లాంటి ఆయనకు నాకు టగ్గుబడిపోయ
నేను రెండో క్లాసు లో వుండగా, మా వూర్లో ఇస్కోల్లో ఇవోర్లలో రెండు గ్రూప్లు వుండే
౧. ఎర్రమేడం (విజయ ప్రభ దేవి ), లెక్కల ఐఒరు (సోమశేఖర్ ),సోషయాల్ఐఒరు (నరసింహులు శెట్టి)
౨.నల్ల మేడము(మనో రంజని), హెడ్ మాస్టారు ,
వీళ్ళల్లో మనకు పస్టు గ్రూపు తో లిన్కెక్కువ సరే ఒకదినం మా వూరు రాధా గోడు ఇస్కోలు పక్కనే వున్న పుల్లయ్య గారి ఇంటి పక్కన కుచ్చోని పారీస్చ పేపెర్లు కాపీ కొడతా వుంటే నేను సల్లగా లెక్క ల ఇవోరికి సేప్పస్తి,అంతే వాడి వొళ్ళు వూదిపోయ్యింది , అంతే వాడు నా మీద కచ్చ పెట్టుకొని హెడ్మాస్టారు కి పురక్క్న్చినాడు ,
ఆ పొద్దు నేను ఇస్కోలుముందర కుచ్చోని రాసుకుంటా వుంటే , గుట్టకింద్దూరునిత్య గోడు , గాండ్లోల్ల మురళి గోడు , రాధా గోడు నను సూపించినారు , నాకు గుండె కాయజారిపోయా , స్వామి గబగబా నాలుగు మొక్కులు మొక్కితి , నా మాట ఇంట్లో నే ఎవ్వురూ పట్టించుకోరు అట్లాంటిది అయన ఎందుకు పట్టిచుకుంతాడు, నేను ఇంటిపాటం రాసు కుంటా వుంటే హెడ్ మాస్టారు వచ్చి ఏఁ వైయ్ ఎట్టా వుండాది ఒళ్ళు అనే ,అంతే నాకు ఒణుకు బుట్టె

2, నవంబర్ 2008, ఆదివారం

పెద్ద ఇస్కోల్లో నేను

అసలు పద్మనాభ నాయుడు సారంటే మామూలు ఉస్కా ఐఒరుకాదు ,అయన ఒక లూనా వుండే దాన్లో వచ్చి ఇస్కూలు ముందర నిలబెట్టి ఓఱేఈ ఇస్కూలు గంట కొట్టినార అంటే నాలాంటి దైర్నస్తుడికి కూడా సెడ్డి తదిసిపోతావుందే ,సరే మనం క్లవెర్ కాబట్టి మనకేంబయ్యం అనకుంతావుంటే రెందోక్లాసు లీడర్ మనమే గదా అనుకుంటి ,కానీ ఆ యొక్క బగమన్మ్తుడుఇంకో రకం గా అన్కొని మా నరేష్ గాడిని లీడర్ సేసి పారేసే , మనం మింగ లేక కక్క లేక అల్లడతావుంటిమిసరే వాడు మన కంటే గూడ క్లవెర్ గదా అన్కొని వుంటి .ఇంతలో జండా పండగ వచ్చే ,మనం జండా పాట విజయీ వీస్వతి రంగా ప్యారా లాంటి పాటలు నేర్సుకొని రెడీ గా వుంటే పెద్ద పిలయకాయలు (ఏడో క్లాసు పిలకాయలు )ఆపాట పాడేసిరి సరే తెలివికి నాలెడ్జి కి ఈడ చోటు లేదు అన్కూని మన కు తగినచోటు యాదమూరి లో శ్రీ విష్ణుప్రియ ఇంగ్లిషు మీడియం ఇస్కోలు మాత్రమేనని నిశ్చయం చేసుకూని మా యమ్మను కదిలిస్తి మాయమ్మ కదల్ల సరే ఇట్టాంటి విషయాలు మొగోళ్ళు మొగోళ్ళు సూసుకోవాలని మా నాన్న తో సేప్తిప్చ్ మానాయనగూడ మన పట్టిచుకోల ,సరే తలరాత ఇట్టా వుందని సర్దిసేప్పుకొని పెద్దిస్కోలు కే పోతావుండా ,

నేను ఎస్ .పి.ఎల్

నేను మా వుళ్ళో సిన్నప్పుడి నుంచీ అంటే బాలవడి నుంచీ సడువుకున్తావుంటిని. బాలబడి అంటే మన ఇస్తా రాజ్యంఅని అందరూ అంకుంటాఉంటారు , ఏలంటే ఆడ ,టీచరు మా సిన్నవ్వ .పేరుకే అవ్వ కాని నన్ను ,మా అత్త కొడుకు నరేష్ గాడిని మాయవ్వ ములాజులేకుండా ఉతికి ఆరేస్తా ఉండే ,మేడమ్మ మనవళ్ళుగా మా మీద శానా బరువు బాద్యతలుండే ,మేము అసలు శానా సక్కగా సదువుకోవాలిలేక పోతే మాయవ్వ ఇంట్లో కూడా పాఠాలు సేప్తాది కాబట్టి మేము శానా కష్టపడత ఉంటిమి .ఇస్కూలు అవగానే పిలకాయలంతా ఇండ్లకు బోతా ఉంటే మేము గుక్కు మిక్కని ,టూసన్లోగుచ్చూని సాయంత్రంబస్సు కోసం వాయిటింగ్ సేస్తా ఉంటాము ,ఎలేంటే సాయంత్రం ఉర్లోబస్సు వస్తే గానీ మాయవ్వ టూషణ్వదిలి పెట్టదు , ఇవ్వన్నీ గాకుండా ఆదివారం ఇంట్లో లెక్కల ట్యూషన్ ,మనం లెక్కల్లో క్లేవేర్మి కాదు కాబట్టి ఇంక తప్పక లెక్కలు సేస్తా ఉంటిమి ,దీంట్లో మా నరేష్ గోడు బెట్టరువాడికి లెక్కలు బాగా వస్తాయి ,

సూస్తా సూస్తా ఉండగానే నేను బాలవాడి దాటి పెద్దిస్కోలులోకి వచ్చేస్తేమి ,ఆ పొద్దు మన స్టిల్లు సూడల్చిందేగానీ సేప్పలేము ,అప్పిడికేమాయన్న యాదమూరులో కానిమెంటుకు పోతా వుండే ,అసలు మనం గూడా ముందు కానిమెంటు లో నే సేరినా,మన కు బోరుబండి అంటే శానా ఇష్టం కాబట్టి అదే కావాలని శ్రీదేవి మేడం ని తిట్టి తన్ని ,మాయన్నని తన్నించి ఇస్కూలుకి నిల్చి పోయి శానా శానా కతలు సేస్తిమి కాబట్టి ,వీణ్ణి ఊర్లో ఇస్కోల్లో నే పెట్టాలని ఇంట్లో అనుకుని దీన్లూ పడదోసిరి . మనం చానా చానా క్లేవేర్ మీ కాబట్టి ఒకటో వచ్చేస్తిమి ,కానీ లోపల కొంచం బయం గానే ఉండే ఏలనంటే మా పెద్ద ఇకలాసు సధవకుండా రెండో కలాసు లో కి వచ్చే స్తిమి గానీ ఐ స్కోలులో హెడ్డు మాస్టారు ఎవరను కున్న్యారు ,పద్మనాభ నాయుడు .